iPhone 18 Pro Max: సాధారణంగా సినిమా రిలీజై బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లు కొల్లగొట్టిన తర్వాతో లేదా షూటింగ్ మొత్తం పూర్తయిన సందర్భంలోనో హీరోలు, నిర్మాతలు దర్శకులకు కార్లు, ఖరీదైన కానుకలు ఇవ్వడం చూస్తుంటాం. కానీ కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ మాత్రం అందుకు భిన్నంగా అందరినీ ఆశ్చర్యపరిచారు. సినిమా ఇంకా సెట్స్ పైనే ఉండగా.. అది కూడా తొలి షెడ్యూల్ ముగియగానే తన దర్శకుడికి మైండ్ బ్లోయింగ్ సర్ప్రైజ్ ఇచ్చి నెటిజన్లను ఫిదా చేశారు..