తమ ప్రయాణం, జీవితం, ఒక అందమైన కొత్త ప్రారంభం నాలుగేళ్ల క్రితం సరిగ్గా ఈ తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రం నుంచే మొదలయ్యాయని ఆమె రాసుకొచ్చింది. దిశ, సినిమా: తమిళ సీరియల్ నటి మహాలక్ష్మి, తమిళ ప్రముఖ నిర్మాత రవీందర్ వివాహం 2022లో జరిగిన విషయం తెలిసిందే. అప్పట్లో వీరి పెళ్లి సౌత్ సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా మహాలక్ష్మి కేవలం డబ్బు కోసమే రవీందర్‌ను పెళ్లి చేసుకుందని, కొన్ని రోజులకే వీరిద్దరూ విడిపోతారని సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తూ విమర్శలు గుప్పించారు. అయితే ఆ ప్రచారాలన్నింటికీ ఈ జంట తమ ప్రేమతో చెక్ పెడుతోంది.