మారథాన్‌లో ఉత్సాహంగా పాల్గొని.. పతకం సాధించిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ఆదివారం చోటుచేసుకుంది. మణికొండ అల్కాపూర్ ప్రాంతంలో నివసించే కొమ్మినేని గోపి (36) ఓ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ఎన్ఈబీ అనే సంస్థ ఆదివారం ఉదయం గచ్చిబౌలి స్టేడియంలో మారథాన్ నిర్వహించింది. అనంతరం అల్పాహారం తీసుకునేందుకు వెళ్తూ ఒక్కసారిగా కుప్పకూలారు. నిర్వాహకులు వెంటనే స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక సమాచారం మేరకు గుండెపోటుతో మృతి చెందినట్లు తెలుస్తోందని ఇన్స్పెక్టర్ తెలిపారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి.