Amit Shah Padayatra in Hyderabad : సర్ ప్రక్రియపై ఇండియా కూటమి చేస్తున్న ప్రచారంపై హైదరాబాద్లో బీజేపీ భారీ పాదయాత్ర నిర్వహిస్తోంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ పాదయాత్రలో పాల్గొననున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్షా నేతృత్వంలో హైదరాబాద్లో నేడు జరగనున్న మహా పాదయాత్ర కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది. లోక్తంత్ర బచావో - అరాచకత హఠావో పేరుతో సాగే ఈ మహా పాదయాత్ర ఎల్బీ స్టేడియం నుంచి ఎంజే మార్కెట్ వరకు సాగనుంది. సర్కు వ్యతిరేకంగా దిల్లీలో విపక్షాలు చేపట్టిన ర్యాలీకి దీటుగా అమిత్ షా పర్యటనను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని తెలంగాణ బీజేపీ ఏర్పాట్లు చేసింది.