ప్రస్తుతం టెలివిజన్ మార్కెట్లో భారీ స్క్రీన్లకు డిమాండ్ పెరుగుతోంది. ఓటీటీ సినిమాలు, స్పోర్ట్స్, హైఎండ్ గేమింగ్‌ను పెద్ద తెరపై ఆస్వాదించాలని చాలామంది కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ LG తన 115 ఇంచుల QNED evo AI Mini LED టీవీతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. భారీ 4K డిస్ప్లే, ఆధునిక మినీ ఎల్ఈడీ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లతో ఈ టీవీ ప్రీమియం ఎంటర్టైన్మెంట్ అనుభూతిని అందించేలా రూపొందించారు.