ఇండి కూటమి సర్ ఆందోళనలకు కౌంటర్ ఇస్తోంది బీజేపీ. అమిత్ షా మహాపాదయాత్రతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కనున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఢిల్లీలో ధర్నాలు చేస్తే, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ హైదరాబాద్లో జంగ్ సైరన్ మోగిస్తోంది. రేపు MJ మార్కెట్ దగ్గర బహిరంగసభలో అమిత్ షా ప్రసంగంపై ఆసక్తి నెలకొంది. మహాపాదయాత్రతో హైదరాబాద్లో గర్జించేందుకు తెలంగాణ బీజేపీ రెడీ అయింది. సర్ ప్రక్రియపై ఇండియా కూటమి, సీజేపీ నిరసనలను తిప్పికొట్టాలన్న జాతీయ పార్టీ ఆదేశాలతో తెలంగాణలో మహాపాదయాత్రకు సిద్ధమైంది రాష్ట్ర బీజేపీ.. లోక్తంత్ర బచావో-అరాచకత హటావో పేరుతో బీజేపీ నిర్వహించే పాదయాత్రలో కేంద్రహోంమంత్రి అమిత్ షా పాల్గొంటారు.