దేశంలో పేదలు, దళితులు, గిరిజనులు , మహిళలకు రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును కాలరాసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో నిర్వహించిన ‘ఇండియా’ (INDIA) కూటమి మెగా ర్యాలీలో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చిన ఆయనకు తెలంగాణ భవన్లో కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కులాలు, మతాల పేరుతో ప్రజలను విభజించి ప్రధాని నరేంద్ర మోదీ.