జర్మనీలోని సార్‌బ్రుకెన్ వేదికగా జరిగిన ‘హైలో ఓపెన్ 2026’ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ విభాగంలో భారత స్టార్ షట్లర్, రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆదివారం ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్ పోరులో డెన్మార్క్‌కు చెందిన లైన్ కేర్స్ఫెల్ట్ను 21-12, 21-14 తేడాతో చిత్తు చేసి టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈ అద్భుత విజయంతో హైలో ఓపెన్ ఉమెన్స్ సింగిల్స్ టైటిల్ గెలుచుకున్న తొలి భారతీయ మహిళా క్రీడాకారిణిగా పీవీ.