ప్రస్తుతం ప్రతి ఇంటా.. ఎలక్ట్రానిక్ పరికరాలు ఉన్నాయి. టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్ తదితర పరికరాలను సామాన్యులు సైతం ఈఎంఐ పద్ధతిలో కొనుగోలు చేస్తున్నారు. మీ ఇంట్లో ఎర్తింగ్ తీగ ఉందా | general. చిన్నపాటి నిర్లక్ష్యం వల్ల మనం కష్టపడి కొనుక్కున్న ఎలక్ట్రానిక్ పరికరాలు బూడిదయ్యే ప్రమాదం ఉంది. దాని కోసం ముందస్తుగా ఇళ్లలో ఎర్తింగ్ తీసుకోవాలని సూచిస్తున్నారు విద్యుత్తుశాఖ అధికారులు. నాణ్యమైన వైరింగ్ ఉన్నప్పటికీ ఎర్తింగ్ లేకుంటే స్విచ్ బోర్డులు కాలడం, ఒక్కోసారి మంటలు రావడం చూస్తూనే ఉన్నాం. కొన్నిసార్లు ఇంట్లోని గోడలు, మిషన్లు పట్టుకున్నా షాక్ కొట్టేస్తుంది.