ఇంటి పనులు.. పిల్లల పోషణ.. కుటుంబ బాధ్యతలతో పాటు ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు ఓరుగల్లుకు చెందిన పలువురు మహిళలు. పొదుపు సంఘాల ద్వారా రుణాలు పొంది స్వయం ఉపాధి వైపు అడుగులేస్తున్నారు. నెలనెలా స్థిర ఆదాయాన్ని పొందడంతో పాటు మరో నలుగురికి ఉపాధి చూపుతున్నారు. వరంగల్ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) సహకారంతో లింకేజీ రుణాలు, స్త్రీనిధి పథకం ద్వారా రుణాలు పొంది.. నా పేరు కె.లక్ష్మి, వరంగల్ ఎల్లంబజారులో ఉంటాం. 2010లో శ్రీలక్ష్మి మహిళా పొదుపు సంఘంలో చేరాను. స్వయం ఉపాధి శిక్షణలో భాగంగా ఫుడ్ ప్రాసెసింగ్, పచ్చళ్ల తయారీ, హైజిన్, ప్యాకేజింగ్, మార్కెటింగ్‌పై శిక్షణ పొందాను.