క్షణికావేశం కాపురంలో నిప్పులు పోసింది.. చిన్నపాటి కుటుంబ కలహాలు చివరకు నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. హైదరాబాద్లోని కొత్తపేటలో భార్య విచక్షణ కోల్పోయి కూరగాయలు కోసే కత్తితో భర్త ఛాతీలో పొడిచి దారుణంగా హతమార్చిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కళ్లముందే తండ్రి రక్తపు మడుగులో కుప్పకూలడంతో కూతుళ్లు కన్నీరుమున్నీరయ్యారు. చిన్నపాటి కుటుంబ కలహాలు చివరకు దారుణ హత్యకు దారితీసిన ఘటన హైదరాబాద్లోని కొత్తపేట పరిధిలో తీవ్ర కలకలం రేపింది. భార్య కూరగాయలు కోసే కత్తితో ఛాతీపై బలంగా పొడవడంతో భర్త ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన చైతన్యపురి పోలీసులు నిందితురాలిని అరెస్ట్ చేశారు.