India vs New Zealand Test: న్యూజిలాండ్తో టెస్టు సిరీస్కు ముందు టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలే అవకాశం కనిపిస్తోంది. స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ (Rishabh Pant) వెల్లింగ్టన్లో జరిగే తొలి టెస్టుకు అందుబాటులో ఉండకపోవచ్చని సమాచారం. గాయం నుంచి కోలుకుంటున్నా.. అతడిని తొందరపెట్టకూడదని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ తొలి టెస్టుకు దూరమయ్యే అవకాశం ఉందని సమాచారం. జర్నలిస్ట్ అభిషేక్ త్రిపాఠి వెల్లడించిన వివరాల ప్రకారం.. నవంబర్ 19న వెల్లింగ్టన్లో ప్రారంభమయ్యే తొలి టెస్టులో పంత్ ఆడటంపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది.