South Africa vs Australia: ఆస్ట్రేలియాపై టెస్టు సిరీస్‌ను 2-1తో గెలిచిన దక్షిణాఫ్రికా మరోసారి తన సత్తా చాటింది. ఈ విజయంతో 2025 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ విజయం అదృష్టంతో వచ్చిందంటూ విమర్శించిన వారికి దక్షిణాఫ్రికా కెప్టెన్ తెంబా బవుమా తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు. టెస్టు క్రికెట్లో దక్షిణాఫ్రికా మరోసారి తన బలాన్ని నిరూపించింది. ఆస్ట్రేలియాతో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. కేప్‌టౌన్‌లో జరిగిన మూడో టెస్టులో 176 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.