కేరక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న వారిలో సుధా ఒకరు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు సుధా. అమ్మ పాత్రలకు సుధా పెట్టింది పేరు. ఎన్నో సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించారు సుధా. హీరో, హీరోయిన్ అమ్మ పాత్ర అంటే టక్కున గుర్తొచ్చే పేరు సుధా. తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన సీనియర్ నటి సుధా, ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, సినీ అనుభవాలను పంచుకున్నారు. ఈ సంభాషణలో దిగ్గజ నటులతో ఆమె అనుబంధం, సినీ పరిశ్రమలో వచ్చిన మార్పులు, తన కుటుంబం గురించి అనేక ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.