పులివెందులలో చోటుచేసుకున్న ఘర్షణలు, రాజకీయ ఉద్రిక్తతలపై ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్, స్థానిక ఎన్నికలు అత్యంత ప్రశాంతంగా జరుగుతుంటే, ఒక్క పులివెందులలో మాత్రమే గొడవలు జరగడానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డే ప్రధాన కారణమని ఆరోపించారు. జగన్ వ్యవహారశైలి వల్లే అక్కడ శాంతిభద్రతల సమస్య తలెత్తుతోందని ఆయన విమర్శించారు. గతంలో ఏకగ్రీవాలు ఎలా జరిగాయో జగన్ చెప్పాలి గతంలో పులివెందులలో అన్ని స్థానాలు ఏకగ్రీవంగా ఎలా ఎన్నికయ్యాయో జగన్మోహన్ రెడ్డి బహిరంగంగా.