ఆంధ్రప్రదేశ్లో 92 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఆదివారం సాయంత్రం 5 గంటలకు ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభమైంది. కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు ఘటనలు మినహా దాదాపు అన్ని చోట్లా పోలింగ్ ప్రశాంత వాతావరణంలో సాగింది. సాయంత్రం వేళల్లో పట్టణ ప్రాంతాల్లో ఓటర్లు పెద్ద ఎత్తున తరలిరావడంతో పోలింగ్ శాతం గణనీయంగా పెరిగింది. నిబంధనల ప్రకారం సాయంత్రం 5.