HMWSSB Green Tankers : హైదరాబాద్లో నీటి కొరతను అధిగమించేందుకు జలమండలి ప్రత్యేక ‘గ్రీన్ ట్యాంకర్లను’ అందుబాటులోకి తెచ్చింది. HMWSSB Green Tankers: ఎల్నివో ప్రభావంతో వర్షపాతం తగ్గడంతో భాగ్యనగరంలో తాగునీటి కష్టాలు తీవ్రరూపం దాలుస్తున్నాయి. రాబోయే రోజుల్లో సూపర్ ఎల్నివో పరిస్థితుల వల్ల నీటి ఎద్దడి మరింత తీవ్రమయ్యే ప్రమాదముందని హెచ్చరించిన జీహెచ్ఎంసీ, నీటిని వృథా చేసేవారిపై భారీ జరిమానాతో పాటు కనెక్షన్ రద్దు వంటి కఠిన చర్యలకు సిద్ధమైంది. ఈ సంక్షోభాన్ని అధిగమించేందుకు ప్రత్యామ్నాయంగా ఆధునిక సాంకేతికతతో శుద్ధి చేసిన మురుగునీటిని నిత్యావసరాలు మినహా ఇతర పనులకు సరఫరా చేసేందుకు జలమండలి నిర్ణయించింది.