హైదరాబాద్లోని కవాడిగూడలో దారుణం చోటుచేసుకుంది. మద్యానికి డబ్బులు అడిగాడన్న ఆగ్రహంతో.. ఓ యువకుడు వృద్ధుడిపై దాడి చేశాడు. తీవ్రగాయాలపాలైన వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందారు. హైదరాబాద్, నవంబర్ 1: నగర పరిధిలోని కవాడిగూడలో వృద్ధుడి హత్య కలకలం రేపింది. మద్యం తాగేందుకు డబ్బులు అడిగాడన్న ఆగ్రహంతో వృద్ధుడిపై ఓ యువకుడు అమానుషంగా దాడి చేశాడు. ఈ ఘటనలో వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందారు. నగరంలోని కవాడిగూడ పరిధిలోని కల్పనా చౌరస్తా సమీపంలోని సాయి రెస్టారెంట్ అండ్ బార్ వద్ద కొంతమంది మద్యం తాగుతున్నారు. ఇది గమనించిన ప్రకాశ్ అనే వృద్ధుడు ఓ యువకుడి వద్దకు వెళ్లి..