తిరుపతి జిల్లా వెంకటగిరి 35వ వార్డు పరిధిలోని పోలింగ్ బూత్‌లో అభ్యర్థుల గుర్తులు తారుమారు కావడం తీవ్ర కలకలం రేపింది.. దిశ, వెబ్ డెస్క్: తిరుపతి జిల్లా(Tirupati District) వెంకటగిరి మున్సిపల్ ఎన్నికల(Venkatagiri Municipal Election) వేళ గందరగోళం నెలకొంది. పట్టణంలోని 35వ వార్డు పరిధిలోని పోలింగ్ బూత్(Polling Booth)లో అభ్యర్థుల గుర్తులు తారుమారు కావడం తీవ్ర కలకలం రేపింది. టీడీపీ(Tdp) అభ్యర్థికి కేటాయించాల్సిన 'సైకిల్' గుర్తు వైఎస్సార్సీపీ(Ysrcp) అభ్యర్థి పేరు ముందు ముద్రించబడింది. అలాగే వైఎస్సార్సీపీకి చెందాల్సిన 'ఫ్యాన్' గుర్తును టీడీపీ అభ్యర్థికి కేటాయించినట్లు తేలింది.