విశాఖ జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఓ ఇంట్లో ఆన్ చేసిన కాసేపటికే ఏసీలోంచి ఉన్నట్టుండి ఒక్కసారిగా పొగలు, కాసేపటికే మంటలు వ్యాపించాయి. దీంతో భయపడిపోయిన కుటుంబ సభ్యులు ఇంట్లో నుంచి పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో ఇంట్లోని సామాగ్రి మొత్తం పూర్తి కాలిబూడిదయ్యారు. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేశారు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. బహుళ అంతస్తుల సముదాయంలో కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. చీకటి పడ్డాక ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉన్నారు.. గుండెలు పట్టుకునే దృశ్యం కళ్ళ ముందు కనిపించింది.