Ravindra Jadeja: న్యూజిలాండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు రవీంద్ర జడేజాను ఎంపిక చేయకపోవడంపై చర్చ మొదలైంది. భారత మాజీ క్రికెటర్ చటేశ్వర్ పుజారా కీలక వ్యాఖ్యలు చేశారు. అక్షర్ పటేల్‌కు ఎక్కువ అవకాశాలు ఇస్తుండటంతో జడేజా వన్డే భవిష్యత్తుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. Ravindra Jadeja: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా వన్డే కెరీర్‌పై ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. న్యూజిలాండ్‌తో నవంబర్ 4 నుంచి ప్రారంభం కానున్న ఐదు వన్డేల సిరీస్‌కు ప్రకటించిన భారత జట్టులో అతడికి చోటు దక్కలేదు.