బీటెక్ మొదటి ఏడాదిలోనే చదువు ఆపేసిన ఓ యువతి బురఖా ధరించి, హ్యాండ్ కట్టర్ మిషన్తో ఇళ్ల తాళాలు పగలగొట్టి వరుస చోరీలకు పాల్పడుతోంది. ఏడాదిలో ఐదు చోరీలు చేసిన ఆమెను ఉప్పల్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితురాలి నుంచి సుమారు రూ.70 లక్షల విలువైన బంగారం, వెండి, నగదుతోపాటు ఐఫోన్ 17ను స్వాధీనం చేసుకున్నారు.. హైదరాబాద్, నవంబర్ 1: బీటెక్ మొదటి ఏడాదిలోనే చదువు ఆపేసిన ఓ యువతి దొంగతనాల బాట పట్టింది. బురఖా ధరించి, హ్యాండ్ కట్టర్ మిషన్ సాయంతో ఇళ్ల తాళాలు తొలగించి విలువైన వస్తువులను అపహరిస్తోంది.