ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల సమరం మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా పట్టణ స్థానిక సంస్థలకు ఆదివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 92 పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికలు జరుగుతుండగా.. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. రాష్ట్రంలోని 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 73 మున్సిపాలిటీలు, 6 నగర పంచాయతీల్లో అధికారులు పోలింగ్ నిర్వహిస్తున్నారు. మొత్తం 100 పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికల.