మధుమేహం ఉన్నవారు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏది తినాలి? ఏది తినకూడదు? ఏ ఆహారం రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది? అనే సందేహాలు చాలామందికి ఉంటాయి. ముఖ్యంగా మన రోజువారీ భోజనంలో భాగమైన పెరుగు విషయంలోనూ కొందరికి సందేహాలు వస్తుంటాయి. పెరుగులో సహజంగా చక్కెర ఉంటుందా? షుగర్ ఉన్నవారు దీనిని తింటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయా? అనే ప్రశ్నలు ఎదురవుతుంటాయి.