Lemon Peels Uses Telugu: సాధారణంగా నిమ్మరసం తీసిన తర్వాత తొక్కలను పారేస్తుంటాం. కానీ వాటితో ఇంటిని శుభ్రం చేసుకోవడంతో పాటు, ఫ్రిజ్లో దుర్వాసనను తగ్గించుకోవచ్చు. మైక్రోవేవ్ శుభ్రత నుంచి గదులకు సహజ సువాసన అందించడం వరకు నిమ్మ తొక్కలను ఐదు రకాలుగా ఎలా ఉపయోగించుకోవచ్చో తెలుసుకుందాం. Lemon Peels Uses Telugu: సాధారణంగా మనం నిమ్మకాయలను ఉపయోగించిన తర్వాత వాటి తొక్కలను చెత్తబుట్టలో పడేస్తుంటాం. నిమ్మరసం వంటల్లో, పానీయాల్లో ఉపయోగపడుతుంది కాబట్టి, తొక్కలను పెద్దగా పట్టించుకోము. అయితే, మనం వృథాగా పారేసే నిమ్మ తొక్కలను ఇంటి శుభ్రతతో పాటు, దుర్వాసనలను తగ్గించడానికి, గదులను తాజాగా ఉంచడానికి కూడా ఉపయోగించవచ్చు.