ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇద్దరు స్టార్ హీరోల స్కూల్ డేస్ ఫోటో తెగ వైరలవుతుంది. ఈ ఫోటోలో తరగతిలోని పిల్లలందరూ ప్రస్తుతం ఇండస్ట్రీలో చాలా పాపులర్. అంతేకాదు యావత్ దేశవ్యాప్తంగా ఇద్దరికీ విపరీతమైన క్రేజ్ ఉంది. అలాగే అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువే. ఐదు పదుల వయసులోనూ ఇద్దరూ బ్యాక్ టూ బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ దూసుకుపోతున్నారు. అభిమానులు ఎల్లప్పుడూ సెలబ్రిటీల ఫోటోలను చూడటానికి, వారి వివరాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతారు. అందుకే వారి చిన్ననాటి ఫోటోలు కూడా అభిమానుల దృష్టిని బాగా ఆకర్షిస్తాయి. అలాంటి ఒక ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.