నీరు లేకుండా మనిషి జీవించడం అసాధ్యం. అందుకే ప్రతిరోజూ తాగే నీటి విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి. అయితే మనం కొనుగోలు చేసే వాటర్ బాటిళ్లపై తయారీ తేదీ, ఎక్స్పైరీ డేట్ ముద్రించి ఉండటం చాలామంది గమనించే ఉంటారు. పాలు, పెరుగు, ఇతర ఆహార పదార్థాలకు గడువు తేదీ ఉండటం సహజమే. కానీ నీటికి కూడా గడువు తేదీ ఎందుకు ఉంటుంది? నీరు నిజంగానే కొంతకాలం తర్వాత పాడైపోతుందా? అనే సందేహాలు చాలామందికి కలుగుతుంటాయి.