అది చూడటానికి సాధారణ రాతి ముక్కలాగే ఉంది. కానీ దాని వయస్సెంతో తెలుసా? 410 కోట్ల సంవత్సరాలు. అత్యంత పురాతనమైన రాయి అంగారక గ్రహం (మార్స్) నుంచి విడిపోయి అంతరిక్షంలో ప్రయాణించి ఆఫ్రికాలోని సహారా ఎడారిలో పడింది. రాతిని పరిశీలించిన శాస్త్రవేత్తలు అంగారక గ్రహంపై ఒకప్పుడు నీరు ప్రవహించేదని నిర్థారించారు. సహారా ఎడారిలో దొరికింది ఈ అరుదైన ఉల్కకు శాస్త్రవేత్తలు 'టెఘాజా 001' (Teghaza 001) అని పేరు పెట్టారు. 2022లో ఆఫ్రికాలోని మాలి దేశం సహారా ఎడారిలో ఎనిమిది ముక్కలుగా ఈ ఉల్క లభించింది. వీటిలో అతిపెద్ద ముక్క మనిషి చేతి పిడికిలి పరిమాణంలో ఉంది.