నవంబర్ ఒకటో తేదీ నుంచి హైదరాబాద్లో గ్రీన్ ట్యాంకర్ల సేవలు ప్రారంభిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ప్రకటించారు. తాగునీరు అవసరం లేని పనులకు శుద్ధి చేసిన నీటినే వాడాలని సూచించారు. హైదరాబాద్, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): నవంబర్ ఒకటో తేదీ నుంచి హైదరాబాద్లో గ్రీన్ ట్యాంకర్ల సేవలు ప్రారంభిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు (Telangana CS Sanjay Jaju) ప్రకటించారు. ఈరోజు (శనివారం) రాష్ట్ర సచివాలయంలో హైదరాబాద్లో తాగునీటి సరఫరాపై సీఎస్ సంజయ్ జాజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు.