డబ్బులు ఇస్తామంటూ పేద యువతులకు ఆశ చూపించడం.. ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్కు తీసుకురావడం.. వారి నుంచి అక్రమంగా అండాలు సేకరించి ఫెర్టిలిటీ సెంటర్లకు విక్రయించడం..! హైదరాబాద్లో ఓ ముఠా సాగిస్తున్న ఈ దందా పోలీసుల దర్యాప్తులో బయటపడింది. మహిళల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఈ వ్యవహారం ఇప్పుడు నగరంలో కలకలం రేపుతోంది. హైదరాబాద్ సరూర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటేశ్వర కాలనీలో ఈ అక్రమ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దుర్గాప్రసాద్ అనే వ్యక్తి శెట్టి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ పేరుతో హాస్టల్ నిర్వహిస్తూ.. వివిధ రాష్ట్రాలకు చెందిన పేద యువతులను డబ్బు ఆశ చూపించి హైదరాబాద్కు రప్పించినట్లు పోలీసులు గుర్తించారు.