నగరంలోని కొత్తపేట పరిధిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. క్షణికావేశంలో చెలరేగిన కుటుంబ కలహాలు నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి. భార్యాభర్తల మధ్య జరిగిన తీవ్ర వాగ్వాదం చివరకు భర్త హత్యకు దారితీసిన ఘటన చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం సృష్టించింది. వాగ్వాదం.. విచక్షణ కోల్పోయి దాడి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తపేటకు చెందిన ప్రభాకర్, ఆయన భార్య మధ్య శనివారం తీవ్రస్థాయిలో ఘర్షణ చోటుచేసుకుంది. మాటామాటా పెరగడంతో విచక్షణ కోల్పోయిన భార్య, ఇంట్లోని పదునైన.