హైదరాబాద్లో మహిళలను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న అక్రమ అండాల విక్రయాల హ్యూమన్ ట్రాఫికింగ్ నెట్వర్క్ను మల్కాజిగిరి పోలీసులు ఛేదించారని సీపీ సుమతి వెల్లడించారు. నిందితులు ఒక ముఠాగా ఏర్పడి అండాల సేకరణ, అమ్మకాల దందాను నడుపుతున్నట్లు గుర్తించారు. వెస్ట్ బెంగాల్, మహారాష్ట్రతో పాటు వివిధ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన అమాయక యువతులను ట్రాప్ చేసి, హైదరాబాద్లోని ప్రకాష్ నగర్, సరూర్నగర్, గోపాల్పురం ప్రాంతాల్లోని మూడు వేర్వేరు వసతి గృహాల్లో అద్దెకు ఉంచారు. ఒక్కో సారి అండ.