సెక్యూరిటీ ముసుగులో విద్యార్థులు గంజాయి సరఫరా చేస్తున్న ఒక వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గచ్చిబౌలి ప్రాంతంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న ఈ వ్యక్తి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ విద్యార్థులకు గంజాయి సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. అతడి నుంచి 150 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్లోని గచ్చిబౌలి ప్రాంతంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న ఓ వ్యక్తి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ విద్యార్థులకు గంజాయి సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలు రావడం కలకలం రేపింది. తెలంగాణ ఈగల్ ఫోర్స్ అధికారులు 30 ఏళ్ల బికాష్ సింగ్ అలియాస్ జంగ్ను అదుపులోకి తీసుకుని అతడి నుంచి 150 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.