టాలీవుడ్ డైరెక్టర్లలో పూరి జగన్నాథ్ ది ప్రత్యేక శైలి. ఆయన సినిమాల్లో హీరోల పాత్రలు చాలా పవర్ ఫుల్ గా ఉంటాయి. డైలాగులు కూడా ఓ రేంజ్ లో పేలుతుంటాయి. అందుకే ఈ డైరెక్టర్ తో సినిమాలు చేసేందుకు స్టార్ హీరోలు సైతం ఆసక్తి చూపిస్తుంటారు. అందుకు తగ్గట్టుగానే సీనియర్ హీరోలైన బాలకృష్ణ నుంచి యంగ్ హీరోల వరకు అందరితోనూ సినిమాలు చేశాడు పూరి.