Hyderabad: నగరంలో సంచలనం సృష్టించిన రూ.24 కోట్ల భారీ సైబర్ ట్రేడింగ్ మోసం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) కొరడా ఝుళిపించింది. హైదరాబాద్‌లోని మూడు కీలక ప్రాంతాల్లో అధికారులు ఏకకాలంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ప్రధాన నిందితుడు అలంరాజు సత్యనారాయణ మూర్తికి చెందిన నివాసాలు, వ్యాపార కార్యాలయాలే లక్ష్యంగా ఈ సోదాలు కొనసాగాయి. నకిలీ ట్రేడింగ్ వెబ్‌సైట్‌తో వల స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెడితే స్వల్ప కాలంలోనే భారీ లాభాలు వస్తాయంటూ నిందితుడు బాధితులకు ఆశ చూపించాడు.