Arnab Cyclone: ఏపీలో సంభవించిన అర్నబ్ తుఫాన్ తీవ్ర నష్టాలను, అలాగే ఖరీఫ్-2026 కరువు పరిస్థితులను అధ్యయనం చేయడానికి కేంద్ర బృందాలు పర్యటించనున్నాయి. అర్నబ్ తుఫాన్ నష్టాల పరిశీలనకు కేంద్ర హోం శాఖ జాయింట్ సెక్రటరీ చిత్తరంజన్ దాష్ నేతృత్వంలో ఏడుగురు సభ్యుల బృందం ఇవాళ, రేపు పర్యటించనుంది. మొదట ఆర్టీజీఎస్ (RTGS)లో తుఫాన్ సమయంలో చేపట్టిన చర్యలు, జరిగిన నష్టాలపై అధికారులు కేంద్ర బృందానికి వివరణ ఇస్తారు. అనంతరం రెండు బృందాలుగా విడిపోయి తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేపడతాయి.