Arnab Cyclone: అర్నాబ్ తుఫాన్ కోనసీమపై తీవ్ర ప్రభావం చూపించింది. భారీ వర్షాలు, ఈదురుగాలుల ధాటికి జిల్లా వ్యాప్తంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. తుఫాన్ తీరం దాటి రోజులు గడుస్తున్నా.. చాలా ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనలేదు. ముఖ్యంగా విద్యుత్ సరఫరా పునరుద్ధరణలో జాప్యం ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. రెండు వందలకు పైగా గ్రామాల్లో ఇంకా విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కాలేదు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు ఐదు రోజులుగా అంధకారంలోనే కాలం వెళ్లదీస్తున్నారు. కరెంటు లేకపోవడంతో కనీస అవసరాల కోసం కూడా ఇబ్బందులు పడుతున్నారు. సెల్ఫోన్లలో ఛార్జింగ్ అయిపోవడంతో అత్యవసర సమాచారాన్ని చేరవేయడం కూడా కష్టంగా మారింది.