Raptadu School Attack: అనంతపురం జిల్లా రాప్తాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి బాలికపై ఎలక్ట్రిక్ రంపంతో దాడి చేసిన దారుణ ఘటనలో నిందితుడిని పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. పాఠశాల ఆవరణలోకి హఠాత్తుగా చొరబడి బాలిక గొంతు, ముఖంపై విచక్షణారహితంగా దాడి చేసి పరారైన ఆ ఉన్మాది కోసం ముమ్మరంగా గాలించిన పోలీసులు, అతడిని ధర్మవరంలో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం అందింది. ఇక.. ఈ పాశవిక ఘటన రాప్తాడు మండల కేంద్రంలో తీవ్ర కలకలం రేపింది.