మొదట వెండితెరపైనా ఆ తర్వాత రాజకీయ రంగంలోనూ సత్తా చాటిన ఓ ప్రముఖ నాయకుడి జీవిత చరిత్ర ఆధారంగా సినిమా తీసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ బయోపిక్ లో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత పాత్రలో త్రిష నటించనుందని సమాచారం. ఇందుకు సంబంధించి ఆమెతో చర్చలు కూడా ఓ కొలిక్కి వచ్చినట్లు సమాచారం. సౌతిండియన్ బ్యూటీ త్రిష కృష్ణన్ వెండితెరపై కనిపించి చాలా రోజులు అవుతోంది. అయితే ఇటీవలి కాలంలో ఆమె సినిమాల గురించికాకుండా ఇతర విషయాలతో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు.