న్యూజిలాండ్‌తో నాలుగో టీ20లో భారత్ ఓటమి తర్వాత అభిషేక్ శర్మ 200కు పైగా పరుగుల ఛేజింగ్‌లో తడబడుతున్న విషయం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటివరకు ఇలాంటి టార్గెట్ల కోసం ఆడిన 8 ఇన్నింగ్స్‌లో అతడి స్కోర్లు చాలా తక్కువగా ఉన్నాయి. 199 పరుగుల ఛేజింగ్‌లో సెంచరీ చేసిన అభిషేక్, భారీ లక్ష్యం ఎదురైనప్పుడు ప్రభావం చూపలేకపోతున్నాడు. Abhishek Sharma: టీమిండియా యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ పేరు వినగానే బౌండరీలు, సిక్సర్లు గుర్తొస్తాయి. క్రీజులోకి వచ్చాడంటే ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడటం అతడి స్టైల్. తక్కువ సమయంలోనే టీ20 క్రికెట్లో విధ్వంసకర బ్యాటర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు.