కూరగాయలలో బెండకాయకు ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. ఇందులో విటమిన్లు, కాల్షీయం, మెగ్నీషియం, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అయితే, కేవలం కూరగాయలాగే కాకుండా, బెండకాయను నీటిలో నానబెట్టి ఆ నీటిని తాగడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని ప్రముఖ జనరల్ మెడిసిన్ నిపుణులు డాక్టర్ శివ సుందర్ వెల్లడించారు. బెండకాయ నీటిని తయారు చేయడం ఎలా?: ఈ ఆరోగ్యకరమైన పానకాన్ని తయారు చేయడం చాలా సులభం. నాలుగు తాజా బెండకాయలను చిన్న ముక్కలుగా కట్ చేసి, 200 మి.లీ నీటిలో రాత్రంతా నానబెట్టాలి.