బెంగళూర్ నుంచి చెన్నై వెళ్తున్న ఎక్స్ప్రెస్ ట్రైన్లో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. అర్ధరాత్రి ఓ ప్రయాణికుడికి సంబంధించిన పవర్ బ్యాంక్ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో మంటలు చెలరేగి ట్రైన్ సీటు మొత్తం మంటలు అంటుకున్నాయి. దీంతో భోగీలోని ప్రయాణికులు భయంతో వణికిపోయారు. దీంతో ఘటనా స్థాలానిరి చేరుకున్న రైల్వే పోలీసులు మంటలను అదుపు చేశారు. ట్రైన్లో రాత్రి పూట సెల్ఫోన్ ఛార్జింగ్ పెట్టడాన్ని రద్దు చేస్తూ రైల్వే శాఖ మార్గదర్శకాలు జారీ చేసిన రెండ్రోజులకే బెంగళూర్-చెన్నై ఎక్స్ప్రెస్ పేలుడు సంభవించింది. బెంగళూరును నుంచి చెన్నైకి వెళ్తున్న ట్రైన్లో ఓ ప్రయాణికుడికి సంబంధించిన పవర్ బ్యాంక్ రాత్రి 10.40 సమయంలో పేలిపోయింది.