కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం హన్మాజీపేటలో గుమ్మడి కాశీరాం అనుమానాస్పద మృతి కేసును పోలీసులు హత్య కేసుగా ఛేదించారు. వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడనే కారణంతో భార్య సవిత, ఆమెకు పరిచయమైన సంతోష్, మరో వ్యక్తి రాముతో కలిసి హత్యకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. బాన్సువాడ (కామారెడ్డి): వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే నెపంతో భర్తను పథకం ప్రకారం అంతమొందించిన సంచలనాత్మక ఘటన కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం హన్మాజీపేటలో వెలుగుచూసింది. గుమ్మడి కాశీరాం (26) అనుమానాస్పద మృతి కేసును ఛేదించిన పోలీసులు.. ఇదొక పక్కా ప్రణాళికాబద్ధంగా జరిగిన హత్యగా తేల్చారు.