Andhra Pradesh Weather: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేడు వాయుగుండంగా మారనుండటంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వాతావరణ శాఖ వర్ష హెచ్చరికలు జారీ చేసింది. ఈ వాయుగుండం ప్రభావంతో రాబోయే మూడు రోజుల పాటు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. నేడు మన్యం, అల్లూరి సీతారామరాజు, పల్నాడు, కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. వీటితో పాటు మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు.