ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్న జెన్–జీ (జెన్) ఉద్యమాలు ముందుకు తెచ్చిన ప్రశ్నలు అనేకం. వ్యక్తిగత విజయమే జీవిత లక్ష్యమని బోధించే సమాజంలో, ఆ విజయానికి.. కులం, వర్గం, లింగం, ప్రాంతం, ఆర్థిక స్థితి ఒక వ్యక్తి భవిష్యత్తును ఎంతవరకు నిర్ణయిస్తున్నాయి?సాహిత్యం సమాజాన్ని ప్రతిబింబించడమే కాదు, మనకు అలవాటైన సామాజిక వాస్తవాలను కొత్తగా చూడటానికి కూడా సహాయపడుతుంది. అయితే సాహిత్యం ‘ప్రజాసమూహాల మధ్య జరిగే అనేక భావరీతుల సంఘర్షణను’ ప్రతిఫలించాలి. భిన్నమైన గొంతుకలు వినిపించినప్పుడే సాహిత్యం ప్రజాస్వామిక సంభాషణకు నిజమైన వేదిక అవుతుంది.సంస్కృతి విషయంలోనూ ఇలాంటి పరిశీలనలే అవసరం. భిన్నమైన భాషలు, సంప్రదాయాలు, జీవన అనుభవాలకు సమాన స్థానం ఉందా?