విశాఖపట్నం మహారాణిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా నకిలీ కరెన్సీ చెలామణి చేస్తున్న ఓ దొంగ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. జీవీఎంసీ ఎన్నికల సందర్భంగా నగరంలోని పలు లాడ్జీలు, హోటళ్లపై పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో జగదాంబ జంక్షన్‌లోని వి-స్టార్ హోటల్‌పై పోలీసులు దాడి చేశారు. హోటల్ గది నంబర్ 105ను తనిఖీ చేయగా, అక్కడ రూ.500 నోట్ల రూపంలో ఉన్న కలర్ జిరాక్స్ నకిలీ కరెన్సీ కట్టలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు..