Sree Vishnu: వరుసగా నవ్వులు పంచే ఫ్యామిలీ డ్రామాలు, కామెడీ ఎంటర్టైనర్లతో తనకంటూ పక్కా మార్కెట్ సెట్ చేసుకున్న యంగ్ హీరో శ్రీవిష్ణు.. ఎట్టకేలకు తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చేందుకు సిద్ధమైనట్లు కనిపిస్తున్నారు. ఎప్పుడూ సేఫ్ గేమ్‌కే ప్రాధాన్యం ఇవ్వకుండా, ఈసారి ఏకంగా మైథాలజీ కథతో బిగ్ రిస్క్ తీసుకోబోతున్నారనే వార్తలు టాలీవుడ్ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి. ఇది ఆయన కెరీర్‌కు మరో బలమైన టర్నింగ్ పాయింట్‌గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయని సినీ విశ్లేషకులు.