భారత మహిళా రెజ్లింగ్‌లో సరికొత్త చరిత్ర నమోదైంది. ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించిన తొలి భారత మహిళగా మనీషా భన్వాలా రికార్డు సృష్టించింది. కజకిస్థాన్‌లోని అస్తానాలో శుక్రవారం జరిగిన మహిళల 59 కేజీల ఫైనల్లో అమెరికా రెజ్లర్ అబిగైల్ నెట్టేపై 8-6 తేడాతో విజయం సాధించి పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. ఒక దశలో 0-6తో వెనుకబడినప్పటికీ అద్భుతంగా పుంజుకుని ప్రత్యర్థిని ఓడించడం ఈ విజయానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 0-6 నుంచి 8-6.