Rakul Preet Singh: రామాయణం కథ ఆధారంగా దర్శకుడు నితేశ్ తివారీ తీస్తున్న భారీ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ ‘శూర్పణఖ’ పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ను బయటకు వదిలారు. ‘జనస్థాన యువరాణి శూర్పణఖ’ అంటూ రిలీజ్ చేసిన ఆ పోస్టర్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రకుల్.. శూర్పణఖ క్యారెక్టర్ గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు..