తెలంగాణలో పెట్టుబడులు, పరిశ్రమల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకోవడాన్ని స్వాగతించారు. రాష్ట్రంలో ఇప్పటికే ఫార్మా, బయోటెక్, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), లైఫ్ సైన్సెస్ రంగాలు అభివృద్ధి చెందుతున్నాయని చెప్పారు. ఏరోస్పేస్, రక్షణ రంగం, క్వాంటం కంప్యూటింగ్ వంటి.